డిజిటల్ ప్రీమియర్ గా “రాజ రాజ చోర”

Published on Sep 24, 2021 5:30 pm IST

శ్రీ విష్ణు హీరో గా, మేఘా ఆకాష్ హీరోయిన్ గా హసిత్ గోలి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం రాజ రాజ చోర. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులని అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ప్రసారం అయ్యేందుకు సిద్దం అవుతుంది. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన డిజిటల్ ప్రీమియర్ తేదీ ప్రకటించ బడింది. ఈ చిత్రం అక్టోబర్ 8 వ తేదీన ఈ చిత్రం వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా జీ 5 లో ప్రసారం కానుంది.

జనం మెచ్చిన చోరుడు ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ రూపం లో వస్తుండటం పట్ల ప్రేక్షకులు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :