3 రోజుల్లో 6 కోట్లు వసూళ్లు చేసిన “రాజ రాజ చోర”

Published on Aug 22, 2021 4:22 pm IST

హసిత్ గోలి దర్శకత్వం లో శ్రీ విష్ణు హీరోగా, మేఘా ఆకాష్, సునైనా హీరోయిన్ లుగా నటించిన చిత్రం రాజ రాజ చోర. ఈ చిత్రం ఆగస్ట్ 19 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. మొదటి రోజు నుండే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం తో సినిమా థియేటర్ల వద్దకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. గడిచిన మూడు రోజుల్లో 6 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించడం జరిగింది.

శ్రీకాంత్ అయ్యంగార్, తనికెళ్ళ భరణి, రవిబాబు, అజయ్ ఘోష్, వాసు ఇంటూరి, కదంబరి కిరణ్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు. కామెడీ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

సంబంధిత సమాచారం :