Tollywood Sankranthi History: ‘రాజా సాబ్’కి మిస్ ‘హను మాన్’ని ‘శంకర వరప్రసాద్ గారు’ క్రాస్ చేస్తారా?

msg anuma

మన తెలుగు సినిమా దగ్గర సంక్రాంతి సీజన్ (Tollywood Sankranthi Boxoffice) అనేది చాలా పెద్ద టర్నోవర్. ఆ మూమెంట్ లో జస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా కూడా జనం థియేటర్స్ కి తండోపతండాలుగా క్యూ కడతారు. అయితే ఇన్నేళ్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ఎన్నో సంక్రాంతి బాక్సాఫీస్ క్లాష్ లు సినిమాలు వచ్చాయి. అయితే ఈ సీజన్ లో బిగ్గెస్ట్ గ్రాసింగ్ సినిమాలు లిస్ట్ ఉంటుంది. ఈ లిస్ట్ లో ఈ గీతా కొన్నాళ్ల కాలం వెనక్కి వెళితే.. బిగ్గెస్ట్ గ్రాసర్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ 230 కోట్లకి పైగా గ్రాస్ ని లాంగ్ రన్ లో అందుకుంది. అయితే ఇదే సంక్రాంతి బరిలో దానిని కూడా బ్రేక్ చేసిన సినిమా ‘హను మాన్’.

Hanu Man history in Sankranthi race – 92 రెండేళ్ల హిస్టరీలో ‘హను మాన్’ పేరు!

తెలుగు సినిమా నుంచి సంక్రాంతి బరిలో తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా 2024లో విడుదల అయ్యి అప్పటికి ఉన్న వాల్తేరు వీరయ్యని క్రాస్ చేసి 92 ఏళ్ల సంక్రాంతి హిస్టరీలో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. 300 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకొని సంక్రాంతి బరిలో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

Sankranthiki Vasthunam Records – రీజనల్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’

వెంకీ మామ, ఇదే అనీల్ రావిపూడి కాంబినేషన్ లో గత ఏడాది వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం రీజనల్ గా 300 కోట్లకి పైగా రాబట్టి ఇండస్ట్రీ హిట్ అయ్యింది.

Raja Saab missed golden chance – రాజా సాబ్ కి మిస్..

సంక్రాంతి బరిలో హను మాన్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలకి మించి రికార్డు వసూళ్లు ఒక రకంగా ఈ చిత్రానికి నమోదు అయ్యే ఛాన్స్ ఉండేది. ప్రభాస్ లాంటి బిగ్ స్టార్ పైగా పాన్ ఇండియా సినిమా కావడంతో రీజనల్, పాన్ ఇండియా చూసుకున్నా ఈ సినిమా హైయెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుంది అని అనుకున్నారు. కానీ ఈ సినిమా అందుకు నోచుకోలేకపోవడం అనేది బాధాకరం.

వీటిని మించి ‘మన శంకర వరప్రసాద్’ గారితో బాస్ తన పేరిట రికార్డు సెట్ చేస్తారా?

మెగాస్టార్ చిరంజీవి ఆల్రెడీ ‘మన శంకర వరప్రసాద్’ (Mana Shankara Vara Prasad) గారితో 260 కోట్లకి పైగా గ్రాస్ తో తన కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ ని కొట్టారు. ఈజీగా సంక్రాంతికి వస్తున్నాంని కూడా ఈ సినిమా క్రాస్ చేసే ఛాన్స్ ఉంది. కానీ రీజనల్, పాన్ ఇండియా లెవెల్లో చూసుకుంటే రాజా సాబ్ కి ఫీట్ మిస్ అయ్యింది. హను మాన్ ని ఈ సినిమా లాంగ్ రన్ లో క్రాస్ చేస్తుందా అనేది ప్రశ్న. అలా క్రాస్ చేస్తే మాత్రం మరోసారి సంక్రాంతికి హైయెస్ట్ గ్రాసర్ సింహాసనం మళ్ళీ మెగాస్టార్ దే అనుకోవచ్చు. మళ్ళీ ఈ రేంజ్ హిట్ కొట్టడం ఎప్పుడుకి జరుగుతుంది అనేది కూడా వేచి చూడాలి.

Exit mobile version