‘రాజా ది గ్రేట్’ మొదటిరోజు వసూళ్ల వివరాలు !

19th, October 2017 - 11:23:10 AM

మాస్ మహారాజ రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ చిత్రం నిన్ననే ప్రేక్షకులముందుకొచ్చింది. చాలా రోజుల తర్వాత రవితేజ నుండి వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపించారు. దీంతో సినిమా మొదటిరోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ట్రేడ్ వర్గాల లెక్కలు ప్రకారం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.5 కోట్ల పైగానే షేర్ ను వసూలు చేసినట్టు తెలుస్తోంది.

ఏరియా
కలెక్షన్స్
నైజాం 1.95 Cr
సీడెడ్ 0.76 Cr
ఉత్తరాంధ్ర 0.60 Cr
వెస్ట్ 0.30 Cr
ఈస్ట్
0.40 Cr
కృష్ణ 0.29 Cr
గుంటూరు 0.50 Cr
నెల్లూరు 0.22 Cr
మొత్తం షేర్ 5.02 Crore

ఇక ప్రపంచవ్యాప్తంగా వసూలైన గ్రాస్ ను చూస్తే రూ.10 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక వేరే పెద్ద సినిమాలు లేకపోవడం, ఈరోజు దీపావళి కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ వసూళ్ల జోరు ఇలానే కొనసాగే అవకాశముంది.