‘రాజా ది గ్రేట్’ తాజా వసూళ్ల వివరాలు !

22nd, October 2017 - 11:23:36 AM

రవితేజ తాజా చిత్రం ‘రాజా ది గ్రేట్’ బాక్సాఫీస్ వద్ద మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సాదించిన వసూళ్లే రవితేజ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ గా నిలిచాయి. దాదాపు రెండేళ్ల తర్వాత స్క్రీన్ మీద కనబడ్డ రవితేజకు ఈ విజయం మంచి ఉత్తేజాన్ని ఇచ్చిందనే చెప్పాలి. నిర్మాణ సంస్థ నుండి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులకుగాను రూ.15.73 కోట్ల షేర్ ను వసూలు చేసిందని తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే నాలుగు రోజులకుగాను గ్రాస్ రూ.31 కోట్లగా ఉంది.

ఇక ఏరియాల వారీగా చూస్తే

ఏరియా
వసూళ్లు
నైజాం 6,55,00,000
సీడెడ్ 2,55,00,000
ఉత్తరాంధ్ర 1,89,00,000
వెస్ట్ 91,34,855
ఈస్ట్
1,17,49,856
కృష్ణ 1,02,16,951
గుంటూరు 1,11,40,965
నెల్లూరు 52,00,000
మొత్తం 15.73 కోట్లు