‘రాజా ది గ్రేట్’ ఓవర్సీస్ వసూళ్లు !

రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ చిత్రం నిన్న విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే. దీపావళి సీజన్ ను టార్గెట్ చేసుకుని రిలీజైన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోను రూ.5 కోట్ల పైగానే షేర్ ను వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద కూడా మాస్ మహారాజ తన సత్తా చూపించాడు. సాధారణంగా అన్ని సినిమాలు వీకెండ్స్ లో విడుదలై మంచి కలెక్షన్స్ రాబడితే ‘రాజా ది గ్రేట్’ మాత్రం వారం మధ్యలో విడుదలైనా కూడా మంచి ప్రదర్శన కనబర్చింది.

మంగళవారం రాత్రి 95 స్క్రీన్లలో ప్రదర్శించిన ప్రీమియర్ల ద్వారా 1.33 లక్షల డాలర్లను రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాత బుధవారం రాత్రి 11 గంటల 45 ల వరకు 90 స్క్రీన్ల నుండి 36,466
డాలర్లను రాబట్టి మొత్తంగా 1.70 లక్షల డాలర్లను ఖాతాలో వేసుకుంది. మంచి టాక్ రావడం, వేరే పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఈ వారం సినిమా కలెక్షన్లకు కలిసొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.