ప్రీ రిలీజ్ వేడుకకు సిద్దమైన ‘రాజా ది గ్రేట్’ !

మాస్ మహారాజ రవితేజ సరికొత్తగా సిల్వర్ స్క్రీన్ ను స్ట్రైక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘రాజా ది గ్రేట్’ ఈ నెల 18న విడుదలకానుంది. ఈ మధ్యనే విడుదలైన టీజర్, ట్రైలర్ రెండూ బాగుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ క్రేజ్ నెలకొంది. ఈ సినిమాతో రవితేజ మంచి హిట్టందుకోని, పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడం ఖాయమని ఫిల్మ్ నగర్ టాక్.

ఇకపోతే చిత్ర యూనిట్ ఈ నెల 14న భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేసింది. దీంతో పాటే సినిమా ప్రమోషన్లను కూడా మొదలుపెట్టనున్నారు. రవితేజ అంధుడిగా కనిపించనున్న ఈ సినిమాను ‘ పటాస్, సుప్రీం’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల్ని డైరెక్ట్ చేసిన అనిల్ రావిపూడి రూపొందించారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ ప్రిజాద హీరోయిన్ గా నటించింది.