ఈరోజు మాస్ మహారాజ రవితేజ వంతు!


ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్ల తీరులో చాలా మార్పులొచ్చాయి. పిఆర్ టీమ్స్ సినిమా లాంచ్ అయిన రోజు నుండి థియేటర్ల నుండి వెళ్లిపోయేవరకు రక రకాల అంశాలతో దాన్ని ప్రతిరోజు జనాలకు గుర్తుచేస్తూనే ఉంటారు. ఈ ప్రాసెస్లో వాళ్ళు పాటించే కొన్ని అంశాల్లో ఆల్బమ్ లోని పాటలను ఒక్కొకటిగా రిలీజ్ చేయడం కూడా ఒక ఒకటి. ఈనెలలో సినిమాల సందడి ఎక్కువగా ఉండటం వలన ప్రతిరోజూ ఏదో ఒక సినిమా నుండి ఒక పాట బయటికొస్తూ అలరిస్తూ ఉంది.

నిన్నటి వరకు ‘మహానుభావుడు, జై లవ కుశ, స్పైడర్’ వంటి చిత్రాలు పాటలతో, ఆడియో ఆల్బమ్స్ తో సందడి చేయగా ఇప్పుడు మాస్ మహారాజ రవితేజ వంతు మొదలైంది. ఆయన తాజా చిత్రం ‘రాజా ది గ్రేట్’ చిత్రంలోని మొదటి పాట ఈరోజు సాయంత్రకమ్ 6 గంటలకు విడుదలకానుంది. టీజర్ తో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ఈ పాటతో ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తిక్ సంగీతం అందించారు.