‘రాజా ది గ్రేట్’ యూఎస్ వసూళ్ల వివరాలు !

20th, October 2017 - 07:46:08 PM

రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ చిత్రం నిన్న విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే. ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద కూడా మాస్ మహారాజ తన సత్తా చూపించాడు. సాధారణంగా అన్ని సినిమాలు వీకెండ్స్ లో విడుదలై మంచి కలెక్షన్స్ రాబడితే ‘రాజా ది గ్రేట్’ మాత్రం వారం మధ్యలో విడుదలైనా కూడా మంచి ప్రదర్శన కనబర్చింది.

మంగళవారం రాత్రి 95 స్క్రీన్లలో ప్రదర్శించిన ప్రీమియర్ల ద్వారా 1.33 లక్షల డాలర్లను రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాత బుధవారం నాటికి డాలర్లను రాబట్టి మొత్తంగా 1.70 లక్షల డాలర్లను పైగానే ఖాతాలో వేసుకుంది. మంచి టాక్ రావడం, వేరే పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో రెండవ రోజు సైతం ఇదే జోరును కొనసాగించిన ఈ చిత్రం ఇప్పటివరుకు నైజాం లో 3.81 కోట్లు వసూళ్లు చేసింది.