ఇది సెలబ్రేషన్స్ టైమ్ అంటున్న రవితేజ !
Published on Oct 22, 2017 10:44 am IST

రవితేజ తాజా చిత్రం ‘రాజా ది గ్రేట్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి రోజు కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత పుంజుకున్న సినిమా మంచి వసూళ్లను సాధిస్తోంది. దీపావళి సీజన్లో విడుదలకావడం, పెద్ద సినిమాలేవీ లేకపోవడం చిత్రానికి బాగా కలిసొచ్చింది. మొదటి నాలుగు రోజుల్లోనే రూ.18 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా రవితేజ కెరీర్లోని బెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టుకున్న చిత్రంగా నిలబడింది.

ఈ చిత్రంతో చాలా ఏళ్ల తర్వాత మాస్ మహారాజకు మంచి కమర్షియల్ హిట్ దొరికినట్లైంది. దీంతో చిత్ర యూనిట్ ఈ సక్సెస్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో సక్సెస్ మీట్ ను ప్లాన్ చేసింది. ఈ వేడుక ఈరోజు సాయంత్రం హైదరాబాద్లో జరగనుంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించగా మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించింది.

 
Like us on Facebook