‘రాజా విక్రమార్క’ టీజర్ రెస్పాన్స్ పై కార్తికేయ ఎగ్జైట్మెంట్.!

Published on Sep 4, 2021 4:00 pm IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘రాజా విక్రమార్క’. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో 88 రామారెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ శనివారం సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో… కార్తికేయ సహా సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ ప్రోగ్రాం లో కార్తికేయ చాలా ఎగ్జైట్ అయ్యాడు, మెగాస్టార్ టైటిల్ తన సినిమాకి రావడం వరుణ్ తేజ్ తో టీజర్ లాంచ్ దానికి వస్తున్న రెస్పాన్స్ పై ఆనందంగా ఫీల్ అవుతున్నా అని చెప్పాడు. అలాగే ఇది వరకు తన ఆర్ ఎక్స్ 100 సినిమా లాంచ్ కూడా ఇదే రామానాయుడు స్టూడియో నుంచి చేసాం మళ్ళీ ఈ సినిమాకి కూడా జరగడం ఇంకా ఆనందంగా ఉంది అందరూ చాలా సపోర్ట్ చేశారు. ఖచ్చితంగా ఈ సినిమాతో మంచి హిట్ కొడతానని నమ్మకం ఉందని చాలా కాన్ఫిడెన్స్ ఫీలయ్యాడు.

అలాగే డైలాగ్ కింగ్ సాయి కుమార్ మాట్లాడుతూ “టీజర్ విడుదల చేసిన వరుణ్ తేజ్ కి థాంక్స్. ఆల్రెడీ టీజర్ రెస్పాన్స్ అదిరింది. తనకి మంచి టీం కుదిరింది అని కార్తికేయ చాలా ఒదిగి ఉంటాడు అని ఇండస్ట్రీ బావుండాలి, అందులో మనం ఉండాలి. అన్ని సినిమాలు బావుండాలి. అందులో మా ‘రాజా విక్రమార్క’ ఉండాలి” అని అన్నారు.

నిర్మాత ’88’ రామారెడ్డి మాట్లాడుతూ* “ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం కార్తికేయ. ఈ సినిమాకు ఆయన మూలస్థంభం. అందరి ఆశీర్వాదం సినిమాకు ఉంటుందని ఆశిస్తున్నా” అని అన్నారు.

అలాగే దర్శకుడు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ* “నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత ’88’ రామారెడ్డిగారికి, హీరో కార్తికేయకు… నాతో పని చేసిన మా టీమ్ అందరికీ థాంక్స్. మా ఆర్ట్ డైరెక్టర్, కెమెరామేన్, ఎడిటర్, నేను… మేమంతా ఈ సినిమాతో పరిచయం అవుతున్నాం. మాకు కార్తికేయ అవకాశం ఇచ్చాడు. ఆయన పెట్టుకున్న అంచనాలను చేరుకుంటానని ఆశిస్తున్నాను. టీజర్ ప్రేక్షకులకు నచ్చిందని అనుకుంటున్నాను. సినిమా కూడా నచ్చాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

సంబంధిత సమాచారం :