తన కలల కథానాయకుడి ఎవరో బయటపెట్టిన రాజమౌళి !


‘బాహుబలి – ది బిగింగ్’ తర్వాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి స్థాయి పూర్తిగా మారిపోయింది. దేశంలో ఉన్న అన్ని పరిశ్రమల్లోని దాదాపు అందరు స్టార్ నటీనటులు ఆయన దర్శకత్వంలో నటించాలనే తమ కోరికను పలు సందర్భాల్లో బాహాటంగానే వెల్లడించారు. అలాగే రాజమౌళి కూడా తాను ఎవరితో సినిమా చేయాలనుకుంటుంది బయటపెట్టారు. ఈరోజు ఉదయం చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్లో రాజమౌళి మాట్లాడుతూ తనకు సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో సినిమా చేయాలని ఉందని, ఎప్పటికైనా ఆ కోరిక తీరుతుందని ఆశిస్తున్నానని అన్నారు.

గతంలో రాజనీకాంత్ కూడా ఒక సందర్భంలో రాజమౌళి లాంటి దర్శకుడితో పని చేయాలని ఉందని అన్నారు. దీన్నిబట్టి అన్నీ అనుకూలించి రజనీ స్థాయికి తగిన కథను రాజమౌళి అండ్ కో గనుక తయారు చేయగలిగితే వీరి కాంబినేషన్ సెట్టవ్వడం పెద్ద విషయమేమీ కాదు. మరి జక్కన్న తన కలల కథానాయకుడిని మెప్పించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో చెప్పాలి. ఇకపోతే ఈరోజు సాయంత్రం చెన్నైలో బాహుబలి – 2 తమిళ వెర్షన్ పాటల వేడుక ఘనంగా జరగనుంది.