తన ‘మహాభారతం’ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి !

23rd, April 2017 - 01:17:43 PM


మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల ప్రధాన పాత్రలో, ప్రముఖ వ్యాపారవేత్త, ఫిలాంత్రఫిస్ట్ అయిన డా. బి. ఆర్.శెట్టి నిర్మాణంలో దర్శకుడు శ్రీకుమార్ మీనన్ భారత ఇతిహాసం ‘మహాభారతం’ ను ఆధారంగా చేసుకుని ‘మహాభారత – రండమోజమ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ రూ. 1000 కోట్ల అప్రాజెక్ట్ అనౌన్స్ అవగానే అంద్దరిలోనూ మరి రాజమౌళి ఇన్నాళ్లు చెబుతూ వచ్చిన తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ సంగతేమిటనే సందేహంలో పడ్డారు. దీనిపై పలు రకాల వార్తలు కూడా వెలువడ్డాయి.

తాజాగా ఈ అంశంపైనే మాట్లాడిన రాజమౌళి తన మహాభారతం ప్రాజెక్ట్ తప్పకుండా ఉంటుందని కానీ అది ఇంకో సంవత్సరం తర్వాతా లేకపోతే పదేళ్ల తర్వాత అనేది తనకు కూడా ఖచ్చితమైన క్లారిటీ లేదని అన్నారు. అలాగే మోహన్ లాల్ గారు చేస్తున్న ప్రాజెక్ట్ గురించి విన్నానని, వాళ్ల వెర్షన్లో వాళ్ళు చేస్తే తన వెర్షన్ తనకుందని, మహాభారతమనేది మహా సముద్రమని దాని నుండి వాళ్ళు కొంచెం నీళ్లు తీసుకుంటే తాను కొంచెం తీసుకుంటానని, ఇలా ఎంతమందైన తీసుకోవచ్చని ఆయన అన్నారు.