ప్రభాస్, ఎన్టీఆర్ ల మధ్యన కామన్ క్వాలిటీ అదే – రాజమౌళి

Published on Dec 28, 2021 11:40 am IST


రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలు గా తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం లో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగవంతం చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన పలు ఇంటర్వ్యూ లను ఇస్తూ టీమ్ చాలా బిజీగా ఉంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూ లో రాజమౌళి ఒక విషయాన్ని వెల్లడించారు. ప్రభాస్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లలో ఒక కామన్ క్వాలిటీ ఉందని అన్నారు. ఇద్దరు నటులు వేరు అని, వారు ఇద్దరూ భోజన ప్రియులు అంటూ చెప్పుకొచ్చారు. ప్రభాస్ కి వండిన ఆహారం అందుతుంది అని, జూనియర్ ఎన్టీఆర్ చాలా బాగా వంట చేస్తాడు అని అన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఆర్ ఆర్ ఆర్ మూవీ వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం :