ఆర్ ఆర్ ఆర్ సినిమా పై రాజమౌళి కీలక వ్యాఖ్యలు!

ఆర్ ఆర్ ఆర్ సినిమా పై రాజమౌళి కీలక వ్యాఖ్యలు!

Published on Nov 26, 2021 1:19 PM IST

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ లు ఈ చిత్రం లో హీరోయిన్స్ గా నటిస్తుండగా, అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పలు బాషల్లో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు అందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను షురూ చేయడం జరిగింది. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి జనని వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయనుంది.

అయితే తమిళం లో ఈ వీడియో ఉయిరే గా విడుదల కానుంది. ఈ వీడియో విడుదల సందర్భంగా ఎస్ ఎస్ రాజమౌళి పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ యాక్షన్ సీక్వెన్స్ లతో నిండి ఉంటుంది. కానీ కోర్ లో మాత్రం ఎమోషనల్ కరెంట్ గా రన్ అవుతూ ఉంటుంది అని తెలిపారు. అది తన పాలసీ అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు