వైరల్ : మహేష్ సినిమాపై మరోసారి జక్కన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

వైరల్ : మహేష్ సినిమాపై మరోసారి జక్కన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Nov 29, 2022 9:00 AM IST

ప్రస్తుతం ఇండియన్ ప్రైడ్ దర్శక దిగ్గజం ఎస్ ఏఎస్ రాజమౌళి తన లాస్ట్ భారీ హిట్ “రౌద్రం రణం రుధిరం” సక్సెస్ ని గ్లోబల్ వైడ్ గా ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇంటర్నేషల్ వైడ్ గా ఈ చిత్రం స్క్రీనింగ్ కి రాజమౌళి ముఖ్య అతిధిగా వెళ్తుండగా అక్కడి మీడియాతో కూడా రాజమౌళి ముచ్చటిస్తున్నారు. మరి లేటెస్ట్ గా అయితే తన నెక్స్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చెయ్యడం వైరల్ గా మారింది.

నా నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో ఉండనుంది అని తాను తెలుగులో ఓ పెద్ద స్టార్ తనతో సినిమా చేయాలి అనుకుంటున్నానని. పైగా తాను ఎప్పుడు నుంచో ఓ అడ్వెంచర్ చిత్రం చేయాలి అనుకుంటున్నాను అని ఇప్పుడు సరైన సమయం అందుకు దొరికింది అనుకుంటున్నానని అలాగే ఈ సినిమాకి మహేష్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటారని చేస్తున్నానని ఈ చిత్రం గ్లోబ్ టాటరింగ్ గా ఉంటుందని అయితే జక్కన్న కీలక కామెంట్స్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు