వైరల్ : “బాహుబలి” తిరిగొస్తున్నాడు.. జక్కన్న అప్డేట్


మన భారతీయ సినిమాని ప్రపంచ పటంలో మార్చేసిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ ల కలయికలో వచ్చిన ఇండియా ఇండస్ట్రీ హిట్ చిత్రం “బాహుబలి” కోసమే చెప్పాలి. ఈ సినిమా వచ్చి ఉండకపోతే ఇప్పుడు మనం చూసిన చూడబోతున్న ఎన్నో భారీ చిత్రాలు బహుశా వచ్చి ఉండకపోవచ్చు. ఆ స్థాయిలో ముద్ర వేసుకున్న ఈ చిత్రం కానీ దాని ప్రభావం కానీ అంతా ఇంతా కాదు.

అయితే ఎప్పుడు నుంచో బాహుబలి 3 ఉంటుంది అంటూ పలు వార్తలు జక్కన్న అండ్ కో నుంచి ఫన్నీ కన్వర్జేషన్స్ కూడా బయటకి వచ్చాయి. కానీ ఫైనల్ గా మరో అప్డేట్ తో అయితే జక్కన్న రాజమౌళి అందరికీ వేరే ట్రీట్ ప్లాన్ చేస్తున్నట్టుగా రివీల్ చేశారు. బాహుబలి పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందిస్తూ అతడి పేరు వింటే మాహిస్మతి ప్రజలు ఊగిపోతారు. మరోసారి బాహుబలి వస్తున్నాడు అంటూ ఒక యానిమేషన్ సిరీస్ తో వస్తున్నట్టుగా తెలిపారు. బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ అంటూ కొత్త సిరీస్ ని అనౌన్స్ చేసి ట్రైలర్ ని అతి త్వరలోనే లాంచ్ చేస్తున్నట్టుగా తెలిపారు. మరి ఈ క్రేజీ సిరీస్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Exit mobile version