‘పెళ్ళిచూపులు’పై ప్రశంసలు కురిపించిన రాజమౌళి!

31st, July 2016 - 07:06:04 PM

Rajamouli-1
‘పెళ్ళిచూపులు’.. చిన్న సినిమాగా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులూ, సినీ ప్రముఖుల దగ్గర్నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా గురించి ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తూ ఉండగా, తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి సైతం సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఉదయం తన బిజీ షెడ్యూల్ మధ్య వీలు కుదుర్చుకొని, రాజమౌళి, పెళ్ళిచూపులు సినిమా చూశారు. ఇక సినిమా చూడగానే ఆయన తన ట్విట్టర్ ఎకౌంట్‌లో సినిమా గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడారు.

‘పెళ్ళిచూపులు’ సినిమా చాలా బాగుందని, సినిమా అయిపోయాక కూడా సన్నివేశాలన్నీ చుట్టూ తిరుగుతున్నట్టే ఉన్నాయని మొదలుపెడుతూ రాజమౌళి సినిమాపై ప్రశంసలు కురిపించారు. రైటింగ్ పరంగా, డైరెక్షన్ పరంగా, యాక్టింగ్ పరంగా.. ఇలా ఇన్ని విషయాల్లో బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చిన ఈ సినిమా తనకు ఓ మంచి అనుభూతినిచ్చిందని తెలిపారు. ఇలాంటి సినిమాలకు ఇంకా ఎక్కువ థియేటర్లు దొరకాలని రాజమౌళి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్ళిచూపులు సినిమాలో విజయ్ దేవరకొండ, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించారు.