రానాకు దక్కిన గొప్ప ప్రసంశ !


నటుడు దగ్గుబాటి రానా నటించిన తాజా చిత్రం ‘ఘాజి’ 17వ తేదీన విడుదలై ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి మంచి ప్రసంశలు పొందుతున్న సంగతి తెలిసిందే. భారతీయ సినిమా చరిత్రలో మొదటిసారి హాలీవుడ్ స్థాయిని తలపించేలా తెరకెక్కిన సబ్ మెరైన్ చిత్రం కావడం వలన ఈ సినిమాపై ఆరంభం నుండి అంచనాలు, ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువగా ఉన్నాయి. వాటికి తగ్గట్టే సినిమాలో మంచి కథ, విజువల్ ఎఫెక్ట్స్ ఉండటం వలన చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రిజల్ట్స్ దక్కించుకుంటోంది.

పలువురు టాలీవుడ్ హీరో, హీరోయిన్లు, దర్శకులు ఈ చిత్రాన్ని ఎంతగానో మెచ్చుకోగా ఇప్పుడు వాళ్ళ జాబితాలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా చేరిపోయారు. రాజమౌళి ఏదైనా చిత్రం బాగుందని ట్వీట్ చేస్తే అది ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ప్రేక్షకుల్లో స్థిరపయిపోయిన నైపథ్యంలో ఈరోజు జక్కన్న ‘స్క్రీన్ మీద, స్క్రీన్ వెనుక కెప్టెన్ మరియు క్రూ ప్రదర్శన అద్భుతం. ఘాజి టీమ్ గొప్పగా చేసింది’ అంటూ ట్విట్టర్ ద్వారా రానాకు కంగ్రాట్స్ చెప్పారు. మొదట్లో ఈ సినిమాను ఒప్పుకునప్పుడు కూడా చాలా మంది రానా నిర్ణయాన్ని వ్యతిరేకించగా రాజమౌళి మాత్రం ప్రోత్సహించిన సంగతి తెలిసిందే.