జూనియర్ ఎన్టీఆర్‌ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అదృష్టం – ఎస్ ఎస్ రాజమౌళి

Published on Dec 28, 2021 2:36 am IST


టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న చిత్ర బృందం నేడు చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది. ఈ వేడుకకు తమిళ్ స్టార్ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఇదిలా ఉంటే ఈ వేడుకలో రాజమౌళి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్‌, రామ్ చరణ్ తేజ్‌ల గురుంచి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తారక్ నాకంటే సీనియర్‌ అని ఎప్పుడూ గొడవపడుతుంటాడని, అతడిది చైల్డ్‌ మెంటాలిటీ అని, తారక్‌ ప్రేమను తట్టుకోవటం చాలా కష్టమని, టైమ్‌ సెన్స్‌ లేదని అతడిని నేనెప్పుడూ తిడుతూనే ఉంటానని అన్నారు. యాక్షన్‌ అంటే చాలు నా మనసులో ఏం ఉందో అలానే చేస్తాడని, ఇలాంటి నటుడు దొరకడం నా ఒక్కడి అదృష్టం, టాలీవుడ్‌ అదృష్టం మాత్రమే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దొరికిన అదృష్టం అని అన్నారు.

ఇక రామ్ చరణ్ తేజ్‌ని నేను ఎప్పుడు మై హీరో అంటుంటానని, ఎలాంటి ఒత్తిడి లేకుండా సెట్‌కి వస్తాడని, మీకేం కావాలి, దాన్ని నేను ఎలా చేయగలను అని ఆలోచించే మెంటాలిటీతోనే ఉంటాడని, ఇలాంటి మెంటాలిటీని చరణ్‌లో తప్పా నేను ఎవరిలోనూ చూడలేదని అన్నారు.

సంబంధిత సమాచారం :