కల్కి: ప‌వ‌ర్ ప్యాక్డ్ ట్రైల‌ర్.. ఫ‌స్ట్ రోజు చూడాల్సిందే – రాజ‌మౌళి

కల్కి: ప‌వ‌ర్ ప్యాక్డ్ ట్రైల‌ర్.. ఫ‌స్ట్ రోజు చూడాల్సిందే – రాజ‌మౌళి

Published on Jun 22, 2024 5:04 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘క‌ల్కి 2898 AD’ జూన్ 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తుండ‌గా, పూర్తి సైన్స్ ఫిక్ష‌న్ మూవీగా ఈ సినిమా రానుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్ట‌ర్స్, టీజ‌ర్, ట్రైల‌ర్ ఈ సినిమాపై అంచనాల‌ను అమాంతం పెంచేశాయి.

కాగా, ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ట్రైల‌ర్ ను కూడా మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ రిలీజ్ ట్రైల‌ర్ వావ్ ఫ్యాక్ట‌ర్స్ తో రావ‌డంతో అభిమానులు ఉబ్బి త‌బ్బిబ్బ‌వుతున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ పై చూద్దామా అని వారు ఆతృత‌గా ఉన్నారు. కాగా, ఈ రిలీజ్ ట్రైల‌ర్ కు ప్రముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్.రాజ‌మౌళి కూడా ఫిదా అయ్యారు. ఆయ‌న ఈ ట్రైల‌ర్ చూసి స్ట‌న్ అయిన‌ట్లుగా పేర్కొన్నారు.

“ప‌వ‌ర్ ప్యాక్డ్ ట్రైల‌ర్ అంటే ఇది.. ఈ సినిమాను ఖ‌చ్చితంగా ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూడాల్సిందే..” అంటూ రాజ‌మౌళి తాజాగా ట్వీట్ చేశారు. అమితాబ్ బ‌చ్చన్, క‌మ‌ల్ హాస‌న్ పాత్ర‌లు ఈ సినిమాకు బ‌లంగా మారుతాయని ఆయ‌న అన్నారు. ఇప్పుడు క‌ల్కి సినిమాపై రాజ‌మౌళి కామెంట్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు