అజయ్ దేవగణ్ కి రాజమౌళి కంగ్రాట్స్!

Published on Nov 22, 2021 8:46 pm IST


బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ సినీ పరిశ్రమ లోకి అడుగు పెట్టి 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ప్రేక్షకులు, అభిమానులు అజయ్ దేవగణ్ కి ఈ సందర్భం గా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి సైతం సోషల్ మీడియా వేదిక గా అజయ్ దేవగణ్ కి కంగ్రాట్స్ తెలుపుతూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

సినీ పరిశ్రమ లో 30 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు కంగ్రాట్స్ అజయ్ దేవగణ్ సర్ అని అన్నారు. సినిమా పై మీకు ఉన్న డెడికేషన్ మరియు ప్యాషన్ అనేది అన్ మ్యాచబుల్ అని అన్నారు. ఎన్నో విజయాలు మీకు దక్కాలని కోరుకుంటున్నా అని అన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం లో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మేరకు అజయ్ దేవగన్ సినిమా సెట్స్ లో ఉన్న ఒక ఫోటో ను రాజమౌళి షేర్ చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :