దశాబ్దం పూర్తి చేసుకున్న రాజమౌళి బ్లాక్ బస్టర్ మూవీ ‘ఈగ’ … !!

దశాబ్దం పూర్తి చేసుకున్న రాజమౌళి బ్లాక్ బస్టర్ మూవీ ‘ఈగ’ … !!

Published on Jul 6, 2022 9:59 PM IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శత్వంలో నాచురల్ స్టార్ నాని, సమంత కలిసి నటించిన మూవీ ఈగ. విజువల్ వండర్ గా 2012లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎంతో పెద్ద సక్సెస్ సొంతం చేసుకుంది. విలన్ చేతిలో చంపబడ్డ హీరో, మరుజన్మలో ఈగ గా పుట్టి అతడి పై ఏవిధంగా పగ తీర్చుకున్నాడు అనే కథాంశంతో అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు రాజమౌళి ఈగ మూవీని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. వారాహి చలనచిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ మూవీలో కన్నడ స్టార్ నటుడు కిచ్చ సుదీప్ విలన్ గా నటించగా ఇతర పాత్రల్లో ఆదిత్య మీనన్, ఛత్రపతి శేఖర్, శ్రీనివాస రెడ్డి, నోయెల్ తదితరులు ఇతర పాత్రలు చేసారు.

హీరో నాని, హీరోయిన్ సమంతల ఆకట్టుకునే యాక్టింగ్, కీరవాణి సాంగ్స్ బీజీఎమ్, సుదీప్ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ తోపాటు ఈగ ప్రదర్శించే అద్భుత విన్యాసాలు ఈ మూవీకి ఎంతో ఆకర్షణగా నిలిచాయి. పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో సైతం ప్రదర్శితం అయిన ఈగ మూవీ అటు తమిళ్, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అయి అక్కడ కూడా బాగా క్రేజ్ అందుకుంది. ఇక రాజమౌళి కెరీర్ లో ఒన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిన ఈగ మూవీ, ఉత్తమ ఫీచర్ ఫిలింగా అలానే స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో ఏకంగా రెండు జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. ఈ మూవీతో దర్శకుడిగా మరింత గొప్ప పేరు సొంతం చేసుకున్నారు రాజమౌళి. ఇక ఈ ప్రతిష్టాత్మక మూవీ నేటితో సక్సెస్ఫుల్ గా దశాబ్దం పూర్తి చేసుకోవడంతో పలువురు ప్రేక్షకాభిమానులు ఈగ యూనిట్ కి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభినందనలు తెలియచేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు