“RRR” బిగ్గెస్ట్ ఈవెంట్ పై రాజమౌళి ఎగ్జైటింగ్ కామెంట్స్.!

Published on Mar 19, 2022 4:00 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియా వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. మరి కేవలం కొన్ని రోజులు మాత్రమే రిలీజ్ కి మిగిల్చుకొని ఉన్న ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఓ రేంజ్ ఈవెంట్ లను దేశ వ్యాప్తంగా చుట్టేస్తూ వస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా నిన్ననే దుబాయ్ లో గ్రాండ్ ఈవెంట్ కి హాజరైన రాజమౌళి అండ్ కో ఈ ఈవెంట్ అనంతరం ఇండియాలో బిగ్గెస్ట్ ఈవెంట్ అయినటువంటి బెంగళూరు ఈవెంట్ కి సన్నద్ధం అయ్యారు. దీనిపై రాజమౌళి కూడా చాలా ఎగ్జైటింగ్ గా తన రెస్పాన్స్ ని ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. చాలా తక్కువ సమయంలో వెంకట్ గారు ఈ ఈవెంట్ ని ప్లాన్ చేసారని.

సీఎం గారు కూడా వస్తుండడం చాలా ఆనందంగా ఉందని తెలపడమే కాకుండా ఈవెంట్ కి వచ్చే అభిమానులు చాలా జాగ్రత్తగా వచ్చి వెళ్లాలని ఈ భారీ ఈవెంట్ కోసం చాలా ఆసక్తిగా నేను ఎదురు చూస్తున్నానని రాజమౌళి తెలిపారు. ఇక ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోస్ గా నటించగా ఈ భారీ సినిమా ఈ మార్చ్ 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

సంబంధిత సమాచారం :