రాజమౌళి సినిమా అప్పుడే ప్రారంభం కానుందా ?

‘బాహుబలి 2’ విజయం తరువాత రాజమౌళి ఎన్టీఆర్ చరణ్ తో మల్టి స్టారర్ సినిమా చెయ్యోతున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజా సమాచారం మేరకు ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ నుండి ప్రారంభం కానుందని సమాచారం.

ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఈ సినిమా పూర్తి అయ్యేలోపు అక్టోబర్ కావచ్చు. ఈ సినిమా తరువాత రాజమౌళి సినిమా చేస్తాడు. చరణ్ బోయపాటి సినిమా ఈనెల 19 నుండి ప్రారంభం కానుంది. ఈ మూవీ తరువాత రాజమౌళి సినిమాలో నటించబోతున్నాడు ఈ హీరో. డివివి దానయ్య ఈ సినిమాను ప్రతిస్టాత్మకంగా నిర్మించబోతున్నాడు.