ఇంట్రెస్టింగ్..”RRR” జపాన్ రిలీజ్ లో బిజీగా జక్కన్న..!

Published on Sep 25, 2022 9:00 am IST

ఈ ఏడాది మన ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ హిట్ సినిమా “రౌద్రం రణం రుధిరం” సినిమా కోసం అందరికీ తెలిసిందే. దర్శక ధీరుడు, జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో తీసిన భారీ చిత్రం ఇది కాగా ఇండియన్ సినిమా నుంచి అయితే వరల్డ్ లెవెల్లో ఏ సినిమా కూడా అందుకోని భారీ రీచ్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది.

ఇక ఈ చిత్రం కాంబో రాజమౌళి, ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ లకి జపాన్ లో మంచి క్రేజ్ ఉంది. అలాంటిది ముగ్గురు నుంచి ఓ సినిమా అంటే అది వేరే లెవెల్ లో ఉంటుంది. అందుకే అక్కడ జపాన్ వెర్షన్ రిలీజ్ పై మేకర్స్ బాగా దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ చేయగా రాజమౌళి ఇప్పుడు సెపరేట్ గా జపాన్ మీడియాతో ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారట.

లేటెస్ట్ అక్కడి మీడియాకి కూడా ఓ ఇంటర్వ్యూ సినిమా సంబంధించి ఇచ్చారట. మొత్తానికి అయితే మాత్రం జపాన్ లో కూడా RRR నెక్స్ట్ లెవెల్ రిలీజ్ కాబోతుంది అని చెప్పాలి. ఇక అక్కడ ఎలాంటి వసూళ్లు ఈ చిత్రం అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :