మహేష్ తో భారీ ప్రాజెక్ట్ పై రాజమౌళి క్లారిటీ వైరల్.!

Published on Mar 20, 2022 10:12 am IST


మన టాలీవుడ్ లో ఉన్నటువంటి హాలీవుడ్ రేంజ్ కటౌట్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. దీనితో మహేష్ పాన్ ఇండియా ఎంట్రీ సహా ఇంటర్నేషనల్ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఎంట్రీ ఫైనల్ గా ఇండియాస్ టాప్ దర్శకుడు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళితో అనౌన్స్ చెయ్యగానే ఈ మాసివ్ ప్రాజెక్ట్ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి అనేక రకాల ఊహాగానాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతూ వస్తున్నాయి. మరి వీటిలో ఈ సినిమా ఒక భారీ మల్టీ స్టారర్ అంటూ వచ్చిన రూమర్ కూడా ఒకటి. అయితే దీనిపై రాజమౌళి ఇచ్చిన లేటెస్ట్ సాలిడ్ క్లారిటీ మంచి వైరల్ అవుతుంది. ఈ సినిమా ఎలాంటి మల్టీ స్టారర్ కాదనీ ఈ మహేష్ గారే సోలో హీరో అని క్లారిటీ ఇచ్చారు. దీనితో ఈ బిగ్ క్లారిటీ మంచి వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :