బాహుబలి 3 హింట్ ఇచ్చిన రాజమౌళి


బాహుబలి 3 గురించి రాజమౌళి హింట్ ఇచ్చినట్లు ముంబై లోని ఓ బాలీవుడ్ పోర్టల్ చెబుతోంది. ఈ వార్తల ప్రకారం రాజమౌళి కరణ్ జోహార్ ని కలసి బాహుబలి 3 గురించి చర్చినట్లు తెలుస్తోంది.కానీ రాజమౌళి, విజయేంద్రప్రసాద్ లు ఈ వార్తలను ఖండించారు. కానీ ఆన్లైన్ పోర్టల్ చెబుతున్న దానిప్రకారం రాజమౌళి, విరాజయేంద్ర ప్రసాద్ లు బాహుబలి 3 కి సంబందించిన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది.

కరణ్ జోహార్ తలచుకుంటే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏమైనా జరగొచ్చు.తన తండ్రిని నుంచి మంచి కథలు రాబట్టుకోవడంలో రాజమౌళి సిద్ధహస్తుడు. బాహుబలి సిరీస్ ని కొనసాగించడం వారికి పెద్ద కష్టం కాకపోవచ్చ. కాగా బాహుబలి 2 చిత్రం ఇండియా లోనే బిగ్గెస్ట్ హిట్ గా దూసుకుని పోతోంది. హిందీలోనే ఈచిత్రం 400 కోట్ల మార్క్ ని అందుకోబోతోంది.