‘బాహుబలి 2’ స్టోరీ డిస్కషన్‌లో రాజమౌళి!

rajamouli
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ సినిమా విడుదలైన అన్నిచోట్లా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ, మళయాలం ఇలా అన్ని భాషల్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి కూడా తీసుకెళ్ళింది. ఎవ్వరూ ఊహించని రేంజ్ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాకు రెండో భాగం బాహుబలి ది కంక్లూజన్‌కు సంబంధించిన పనులను కూడా రాజమౌళి అండ్ టీమ్ ఇప్పటికే చివరిదశకు చేరుస్తోంది.

అక్టోబర్ నెలలో బాహుబలి పార్ట్ 2ను సెట్స్‌పైకి తీసుకెళ్ళేలా సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం బాహుబలి పార్ట్ 2 స్టోరీ డిస్కషన్ జరుగుతోంది. దర్శకుడు రాజమౌళి, కథా రచయిత విజయేంద్ర ప్రసాద్, నిర్మాతలతో పాటు ఇతర టీమ్ మెంబర్స్ ఈ డిస్కషన్‌లో పాల్గొంటున్నారు. బాహుబలికి మించి అద్భుతంగా ఉండేలా పార్ట్ 2 కోసం రాజమౌళి మరిన్ని ఆసక్తికర అంశాలను జత చేస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ ఈ సినిమాను మరో విజువల్ వండర్‌గా తీర్చి దిద్దేందుకు ప్లాన్ చేస్తోంది. 2016 జూలైలో బాహుబలి పార్ట్ 2ను విడుదల చేసేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version