వైరల్ : మహేష్ సినిమాపై రాజమౌళి మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

వైరల్ : మహేష్ సినిమాపై రాజమౌళి మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Nov 20, 2022 8:02 AM IST

మన టాలీవుడ్ లోనే కాకుండా మొత్తం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ క్రేజ్ ఉన్నటువంటి మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ ఏదన్నా ఉంది అంటే అది దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు ల కాంబినేషన్ అని చెప్పాలి. మరి వీరి కలయికలో అయితే ఎప్పుడు నుంచో అనుకుంటున్నా ఈ భారీ చిత్రం ఫైనల్ గా ఇద్దరు మంచి స్టేజ్ లోకి వచ్చాక అనౌన్స్ చేయడంతో గ్లోబల్ గా అనేక అంచనాలు సెట్టయ్యాయి.

ఇక ఈ సినిమా కోసం రాజమౌళి ఎప్పుడు ఏ చిన్న అంశం బయటకి చెప్పినా అది సెన్సేషన్ అని కూర్చుంటుంది. ఆ మధ్య సినిమా గ్లోబ్ ట్రాటింగ్ సినిమాలా ఉంటుందని చెప్పడంతో పెద్ద సెన్సేషన్ కాగా ఇప్పుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది.

ప్రస్తుతం సినిమా కథ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథని డెవలప్ చేస్తుండగా తనతో పాటుగా తన కోర్ టీం అంతా కూడా ఇప్పుడు స్క్రిప్ట్ పనిలోనే ఉన్నారని చెప్పారు. అలాగే తాను కూడా చాలా కాలం నుంచి ఓ అడ్వెంచర్ థ్రిల్లర్ చేయాలి అనుకుంటున్నానని ఈ చిత్రంపై లేటెస్ట్ గా జక్కన చేసిన కామెంట్స్ మంచి వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు