రాజమౌళి ఒక మూవీని ప్రేక్షకుల కు నచ్చేలా తెరకెక్కించడంలోనే కాదు, ఆ మూవీ గురించి ఆఖరి నిమిషం వరకు ఎవరికీ తెలియాకుండా ,బయటకి పొక్కకుండా చూసుకోవడంలో కూడా నేర్పరి. తన షూటింగ్ సెట్స్ లో మొబైల్ నిషేధించే రాజమౌళి, వందల మంది పాల్గొనే సన్నివేశాలలో కూడా అందరిపై నిఘా ఉంచుతారు. షూటింగ్ లో పాల్గొనే వారికి కాదు కదా అసలు పాత్రలకు కూడా కొన్ని సన్నివేశాలు అంతుబట్టవట. బాహుబలి సమయంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నను సత్యరాజ్ నే అడుగగా, ఒక ఫ్లో, పొంతన లేకుండా తెరకెక్కించే సన్నివేశాలలో అసలు కథేమిటో మాకే తెలియదని సమాధానం చెప్పడం గమనార్హం.
ఇక ఇటీవల చిరంజీవి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ సెట్స్ వెళ్లగా అక్కడ చరణ్ పై అల్లూరి సీతారామ రాజు ఉద్యమబాట ఎంచుకోవడానికి దారితీసిన పరిస్థితులకు సంబందించిన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. ఆసమయంలో చిరంజీవికి కూడా కొన్ని విషయాలు తెలియకూడదనే ఉద్దేశంతో రాజమౌళి షూటింగ్ లో జాగ్రత్త పడ్డారని చిరు స్వయంగా తెలిపారు. మరి విషయాన్ని దాచి క్యాష్ చేసుకోవడం రాజమౌళికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు.
