రాజమౌళి ప్రసంశలు దక్కించుకున్న ‘జ్యో అచ్యుతానంద’

rajamouli
దర్శకుడిగా శ్రీనివాస అవసరాల రెండవ చిత్రం ‘జ్యో అచ్యుతానంద’ ఈరోజే ప్రపంచవ్యాప్తంగా విడుదలై విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటోంది. వీటన్నింటినీ మించి దర్శక ధీరుడు రాజమౌళి పొగడ్తలను సైతం ఈ చిత్రం దక్కించుకుంది. సాధారణంగా మంచి సినిమాలను ప్రోత్సహించడం రాజమౌళికి అలవాటు. అందుకే ఈరోజు ఉదయం సినిమా చూసిన ఆయన సినిమాలో తనకు నచ్చిన ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూ తన అభినందనలు తెలిపారు.

వారాహి చలన చిత్రం, శ్రీనివాస్ ల కాంబినేషన్లో మరో ఫ్యామిలీ, యూత్ ఫుల్ ఎంటర్టైనర్ వచ్చిందని, సినిమా చివరి 10 నిముషాల క్లైమాక్స్ తో పాటు రోహిత్, శౌర్య, రెజినాల నటన, వెంకట్ ఫోటోగ్రఫీ, రమ ఆర్ట్ డైరక్షన్ బాగున్నాయని తన అభిప్రాయం తెలిపారు. ఇప్పటి వరకూ రాజమౌళి బాగున్నాయన్న సినిమాలన్నీ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నాయి అలాగే ఈ సినిమా కూడా మంచి విజయం సాదిస్తుందని సినీ వర్గాలు బలమైం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.