పవన్ తో సినిమా పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..!

Published on Oct 31, 2021 7:06 am IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి కొందరి అగ్ర హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు అయితే అలాగే దర్శకుల విషయానికి వస్తే దర్శక దిగ్గజం రాజమౌళి కూడా ఒకరు. మరి ఈ సెన్సేషనల్ కాంబోలో సినిమా పడితే చూడాలని అంతా ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు కానీ అది ఇక సాధ్యపడదు అని అందరికీ అర్ధం అయ్యిపోయింది. మరి ఇదిలా ఉండగా అసలు ఈ కాంబోలో సినిమా దగ్గర వరకు వచ్చి లాస్ట్ లో ఆగినట్టుగా రాజమౌళి తెలిపారు.

తాజాగా జరిగిన ఓ కాలేజ్ మీటింగ్ లో రాజమౌళి పవన్ కళ్యాణ్ తో సినిమాపై ఓపెన్ అయ్యారు. ఎప్పుడో గత కొన్నేళ్ల కితం ఆయనకు కథ చెప్పడం జరిగింది అని అయితే ఆ టైం కళ్యాణ్ మళ్ళీ చెప్తాను అని అన్నారు కానీ తర్వాత ఎటువంటి కాల్ రాకపోవడం ఇక ఇద్దరు సినిమా దారులు కూడా వేరైపోవడం జరిగిందని తెలిపారు.

నేను ఒకలాంటి సినిమాలు చెయ్యడం పవన్ కూడా సినిమాల కంటే రాజకీయాల్లో ఎక్కువ మక్కువ చూపడంతో ఇక మా సినిమా అలా పక్కకి వెళ్ళింది అని రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అయినా పవన్ పై తనకి ఎప్పుడూ అమితమైన గౌరవం ఉంటుంది అని ముగించారు. దీనితో ఇప్పుడు ఈ మాటలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :

More