వైరల్..మహేష్ తో భారీ సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Dec 11, 2021 8:00 am IST

ప్రస్తుతం దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోలు అయినటువంటి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో చేసిన భారీ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చాలా చురుకుగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రాజమౌళి అండ్ కో కి ఈ ఇంటరాక్షన్ లో ఆసక్తికర ప్రశ్నలే ఎదురవుతున్నాయి.

అలా రాజమౌళికి తన నెక్స్ట్ సినిమాపై ప్రశ్న ఎదురు కాగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చెయ్యడం వైరల్ అవుతుంది. అయితే రాజమౌళి నెక్స్ట్ తీయబోయే భారీ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో అని అందరికీ తెలిసిందే. మరి దీనినే రాజమౌళి కూడా కన్ఫర్మ్ చేశారు.

అయితే ఈ సినిమా సందర్భంలో ఆ ప్రాజెక్ట్ కోసం మాట్లాడడం సరి కాదని ఈ సినిమా సక్సెస్ అంతా అయ్యిపోయిన తర్వాత ఆ సినిమా కోసం మాట్లాడుకుందాం అని తనదైన శైలి సమాధానం మీడియాకి ఇవ్వగా ఇప్పుడు అది కాస్తా వైరల్ అవుతుంది అంతే కాకుండా మహేష్ 29వ సినిమా ట్యాగ్ కూడా ఇండియన్ వైడ్ ట్రెండ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది.

సంబంధిత సమాచారం :