‘మిన్నల్ మురళీ’ పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Dec 30, 2021 9:00 am IST

మన ఇండియన్ సినిమా దగ్గర అతి తక్కువగా టచ్ చేసిన జానర్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో సూపర్ హీరో జానర్ ఒకటి. అయితే అందులోని వచ్చిన అన్ని సినిమాలు కూడా హిట్ కాలేదు. జస్ట్ ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి. కానీ లేటెస్ట్ గా వచ్చిన సరికొత్త సూపర్ హీరో మాత్రం ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని పెంచాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మళయాళ భాషకి చెందిన ఈ చిత్రంలో హీరోగా టోవినో థామస్ హీరోగా నటించగా బాసిల్ జోసెఫ్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. పలు కారణాల చేత ఓటిటిలోనే రిలీజ్ కాబడ్డ ఈ చిత్రం మాత్రం రిలీజ్ అయ్యాక యూనానిమస్ టాక్ ని తెచ్చుకుంది. మరి నిన్న “RRR” యూనిట్ కేరళ ప్రమోషన్స్ నిమిత్తం వెళ్లగా అక్కడ ఈవెంట్ కి ఈ సూపర్ హీరో టోవినో కూడా హాజరయ్యాడు.

మరి అతనిపై మరియు సినిమాపై ఇండియాస్ టాప్ డైరెక్టర్ అయిన దర్శకుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. మిన్నల్ మురళీ సినిమా ఇండియాలోనే ఒక బెస్ట్ సూపర్ హీరో ఫిల్మ్ అని ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ క్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాని తెలిపారు.

సంబంధిత సమాచారం :