దర్శకధీరుడు ఎస్ ఎస్.రాజమౌళి తన నెక్స్ట్ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికే అనౌన్స్ చేసిన జక్కన్న, ఇక ఈ సినిమాను మొదలు పెట్టే పనిలో పడ్డాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లొకేషన్స్ వేటలో ఆయన బిజీగా ఉండగా, తాజాగా ఆయన చేసిన ఒక్క పోస్ట్ మొత్తం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఒక్క పాస్‌పోర్ట్‌ను తాను స్వాధీనం చేసుకున్నట్లుగా.. సింహాన్ని బోనులో బంధించినట్లుగా జక్కన్న తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. దీంతో వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఒక్కసారి కమిట్ అయితే, నా మాట నేనే వినను’ అంటూ తన కల్ట్ మార్క్ డైలాగ్‌తో రిప్లై ఇచ్చాడు. ఇలా జక్కన్న పెట్టిన ఒక్క పోస్ట్‌తో ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్.. ఇలా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తగలబడిపోతున్నాయి.
ఇక మీమర్స్‌కి అయితే అసలైన పండగ అప్పుడే మొదలైంది. ఇంకా సినిమా ఫస్ట్ లుక్ రాలేదు.. టీజర్ రాలేదు.. సినిమాకు సంబంధించి ఎలాంటి కంటెంట్ అప్డేట్ లేదు.. కానీ ఒక్క పాస్‌పోర్ట్‌తో ఇలా మీమర్స్‌కు నిద్రలేని రాత్రిని మిగిల్చాడు రాజమౌళి. పాస్‌పోర్ట్‌తో మహేష్‌కు ఉన్న లింక్‌ను వారు తమదైన విధానంలో మీమ్స్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.