వరల్డ్ లెవెల్లో “RRR”..జక్కన్న బిగ్ ప్లాన్ నిజమేనా..?

Published on Oct 28, 2021 6:32 pm IST

గత మూడు నాలుగు రోజులుగా టాలీవుడ్ సహా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గరే హాట్ టాపిక్ గా నడుస్తున్న సినిమా పేరు “రౌద్రం రణం రుధిరం”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో జక్కన్న రాజమౌళి చేసిన బిగ్గెస్ ఇండియన్ మల్టీస్టారర్ చిత్రం ఇది. మరి ఆరంభం నుంచి ఎనలేని అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రంపై అసలు పనులు ఇప్పుడు మొదలయ్యాయి.

ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు సహా నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ కి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఈ సినిమా నుంచి టీజర్ అప్డేట్ హాట్ టాపిక్ గా మారగా ఇప్పుడు మరోపక్క ఓ ఊహించని టాక్ ఈ చిత్రంపై బయటకొచ్చి వైరల్ అవుతుంది. ఈ సినిమాని వరల్డ్ లెవెల్ రిలీజ్ చెయ్యడానికి అదిరే ప్లానింగ్స్ వేస్తున్నారని తెలుస్తుంది.

ఇందులో ఎంతమేర నిజముందో కానీ హాలీవుడ్ కి చెందిన బిగ్గెస్ట్ ప్రొడక్షన్స్ హౌస్ లలో ఒకటైన వార్నర్ బ్రదర్స్ తో కలిసి ఈ చిత్రం ఇంగ్లీష్ వెర్షన్ ని కూడా రిలీజ్ చేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉన్నారంటూ ఓ గాసిప్ వైరల్ అవుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో అన్నది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :