గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు భారీ ఎత్తున నెగిటివ్ జరిగినప్పటికీ 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచింది అని సినీ వర్గాల్లో టాక్ ఉంది. అయితే చరణ్ కి ఉన్న చాలా పేర్లలో మిస్టర్ బాక్సాఫీస్ అనేది కూడా ఒకటి.
అలాగే నటుడు పరంగా కూడా తనపై మంచి ఫీడ్ బ్యాక్ టాప్ దర్శకుల్లో ఉంది. ఇలా అప్పట్లోనే చరణ్ సత్తా చూసాను అంటూ జక్కన్న రాజమౌళి చేసిన ట్వీట్ ఇపుడు వైరల్ గా మారింది. రామ్ చరణ్ తో రాజమౌళి చేసిన సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ “మగధీర” కోసం తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యిన ఏడాది తర్వాత 2010 లో చేసిన తన పోస్ట్ ని ఫ్యాన్స్ ఇపుడు డిగ్ చేశారు.
దీనిలో “భారీ బడ్జెట్ తాము పెట్టిందే చరణ్ కోసం అని నాకెప్పుడూ చరణ్ సత్తా మీద డౌట్ లేదు. నిజానికి చిరంజీవి గారికి సబ్జెక్ట్ చాలా పెద్దది కావడం వల్ల ఎక్కడో కొంచెం అనుమానం పడ్డారు” అంటూ తెలిపారు. దీనితో అప్పట్లోనే చరణ్ పొటెన్షియల్ పట్ల రాజమౌళి ఏ రేంజ్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.
@ImNihal that big budget came in bcos of Charan.No,I nvr doubted charan's abilities.Infact cjeevigaru had doubts whether d sub is too big 🙂
— rajamouli ss (@ssrajamouli) May 28, 2010