RRR – “నాటు నాటు” విమర్శలపై రాజమౌళి సూపర్ క్లారిటీ.!

RRR – “నాటు నాటు” విమర్శలపై రాజమౌళి సూపర్ క్లారిటీ.!

Published on Dec 11, 2021 11:01 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో స్వాతంత్ర యోధులు అల్లూరి సీతారామరాజు గా అలాగే కొమరం భీమ్ పాత్రల్లో దర్శక ధీరుడు రాజమౌళి తీసిన భారీ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఇప్పుడు సినిమా పెద్ద ఎత్తున రిలీజ్ కి రెడీ అవుతున్న సందర్భంలో చిత్ర యూనిట్ అంతా కూడా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

మరి ఈరోజు తెలుగు మీడియాకి ఈ భారీ సినిమా యూనిట్ హాజరు కాగా వారికి పలు ఆసక్తికర ప్రశ్నలే ఎదురయ్యాయి. అలా నాటు నాటు సాంగ్ పై వచ్చిన సంబంధించి రాజమౌళి ఒక సూపర్ క్లారిటీ ఇచ్చారు. అల్లూరి మరియు భీమ్ లు అలా ఎందుకు డాన్స్ చేశారు అనేది నేను జస్ట్ చిన్న బిట్ మాత్రమే చూపించాను కానీ అందులో ఇంకా చాలా ఉంది. ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది. ఆ సందర్భం అనేది ఎలా వచ్చింది అనేవి సినిమాలో తెలుస్తాయని రాజమౌళి మంచి ఆన్సర్ ని ఈ విమర్శలకు ఇచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు