“RRR” కి సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.!

“RRR” కి సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.!

Published on Mar 16, 2022 7:05 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా వీక్షకులను ఎంతో ఆకర్షితం చేసిన మరో భారీ పాన్ ఇండియా సినిమా “రౌద్రం రణం రుధిరం”. దర్శకుడు రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోస్ తో తీసిన ఈ భారీ సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్స్ లోకి రానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ఇప్పుడు వ్యవధి ఉండగా ఈ గ్యాప్ లో మేకర్స్ అదిరే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసేసారు.

మరి వీటిలో లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ భారీ సినిమా సీక్వెల్ పై స్పందించారు. ఈ సినిమాకి ఎలాంటి సీక్వెల్ లేదని కేవలం ఒక్క సినిమాగానే తీసామని తెలియజేసారు. కానీ బాహుబలి సిరీస్ ని మించిన స్థాయిలో ఈ చిత్రం ఉంటుంది అని మాత్రం తాను చెప్పడం మాంచి ఆసక్తిగా మారింది. మొత్తానికి ఈ బిగ్గెస్ట్ యాక్షన్ అండ్ విజువల్ చిత్రానికి సీక్వెల్ అనేది లేదు అని మాత్రం కన్ఫర్మ్ అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు