భారీ షెడ్యూల్ ప్లాన్ చేసిన రాజమౌళి !

RRR1

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ -రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ యొక్క షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఇక ఈ షెడ్యూల్ తరువాత చిత్ర బృందం కలకత్తా వెళ్లనుందట. సుమారు 40రోజుల పాటు అక్కడ షూటింగ్ జరుపనున్నారు. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు ఇద్దరు పాల్గొంటారని సమాచారం.

భారీ బడ్జెట్ తో దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో నటించే హీరోయిన్లు ఎవరనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. వచ్చే ఏడాది లో తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రం ఫై అంచనాలు తారాస్థాయికి చేరాయి.

Exit mobile version