జక్కన ‘మహాభారతం’ను ఇంకో పదేళ్ల తర్వాత తీయాలనుకోవడానికి కారణం !

27th, April 2017 - 02:24:46 PM


‘బాహుబలి’ సిరీస్ తో ఎస్ఎస్ రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఇంత గొప్ప చిత్రం తర్వాత ఆయన తీయబోయే సినిమాలు ఇంకెంత గొప్ప స్థాయిలో ఉంటాయోనని అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. మరీ ముఖ్యంగా అయన కలల ప్రాజెక్ట్ ‘మహాభారతం’ గురించే ఎక్కడ చూసినా చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. దానికి తోడు మోహన్ లాల్ కూడా ‘మహాభారతం’ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయడంతో ఆ ఉత్కంఠ ఇంకాస్త ఎక్కువైంది.

కానీ రాజమౌళి మాత్రం ‘మహాభారతం’ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నారు. ఇంకో పదేళ్ల తర్వాత మాత్రమే తాను ఆ ప్రాజెక్ట్ ను తీస్తానని చెబుతున్నారు. అన్నేళ్ల ఆలస్యానికి కారణం కూడా స్పష్టంగా తెలుయజేశారు. అదేమిటంటే ఆయన ఊహల్లో ఉన్నట్టు మహాభారతన్ని తెరపైకి తీసుకురావాలంటే ప్రస్తుతమున్న సాంకేతికత, వనరులు సరిపోవని అందుకే ఇంకో పదేళ్ల తీస్తానని అన్నారు. అలాగే తన నెక్స్ట్ చిత్రం ఓ చిన్న కుటుంబ కథా చిత్రంగా ఉండబోతోందని కూడా తెలిపారు.