రాజమౌళి ఆ సినిమాని 100 సార్లు చూశారట..!

17th, December 2017 - 07:19:31 PM

బాహుబలి తరువాత రాజమౌళి ఖ్యాతి విశ్వవ్యాప్తం అయింది. ఇండియాలో రాజమౌళి అంటే తెలియని సినీ అభిమాని ఉండరు. అంతలా రాజమౌళి చిత్రాలు ప్రభావం చూపాయి. కానీ ఈ దర్శక ధీరుడిపై ఓ హాలీవుడ్ చిత్రం తిరుగులేని ప్రభావం చూపిందట. ఆ చిత్రం ఇంకేదో కాదు.. మెల్ గిబ్సన్ తెరకెక్కించిన బ్రేవ్ హార్ట్.

ఆ చిత్రాన్ని తాను వద్దకు పైగా సార్లు చూశానని రాజమౌళి అన్నారు. ఆ చిత్రంలో ప్రతి యాక్షన్, ప్రతి సీన్లో ఉండే ఎమోషన్ అద్వితీయం అని రాజమౌళి అన్నారు. ఆ చిత్రం తన ఊహకు అందని విధంగా ఉంటుందని రాజమౌళి అన్నారు. కాగా రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో తీయబోయే చిత్ర స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు.