మహేష్ తో సినిమాకి వచ్చిన మాస్ రెస్పాన్స్ పై రాజమౌళి కామెంట్స్!

Published on Oct 2, 2022 3:00 am IST


ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర ఎన్నెన్నో సినిమాలు భారీ అంచనాలు నెలకొల్పుకొని ఉన్నాయి. అయితే వీటిలో మాత్రం మరింత స్పెషల్ పాన్ ఇండియా సినిమా ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబోలో సినిమానే అని చెప్పాలి. ఎప్పుడు నుంచో ఈ కాంబోలో సినిమా పడాలి అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి ఏకంగా పాన్ వరల్డ్ లెవెల్ సినిమాని అయితే వీరు అనౌన్స్ చేశారు.

మరి రాజమౌళి జస్ట్ ఈ సినిమా ఎలా ఉంటుంది అనే దానిపై చిన్న వర్డ్ “గ్లోబ్ టోట్టరింగ్” అని చెప్పగా దానికి భారీ రెస్పాన్స్ వచ్చి ఇండియన్ ట్రెండ్స్ లో నిలిచింది అని రాజమౌళి ఈరోజు లాస్ ఏంజెల్స్ లో తన లాస్ట్ సినిమా RRR స్పెషల్ స్క్రీనింగ్ లో పాల్గొనగా చెప్పారు. తన నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుంది ఎవరితో ఉంటుంది అనే దానిపై మాట్లాడుతూ మహేష్ సినిమాతో వచ్చిన రెస్పాన్స్ పై అయితే తన ఎగ్జైట్మెంట్ ని పంచుకోవడం ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.

సంబంధిత సమాచారం :