“రాధే శ్యామ్”తో పోటీపై రాజమౌళి సాలిడ్ క్లారిటీ.!

Published on Oct 30, 2021 7:14 pm IST

గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తున్న భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీ స్టారర్ నిన్నటి నుంచే నెవర్ బిఫోర్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసుకుంది.

అయితే ఇదిలా ఉండగా నిన్న జరిగినటువంటి మీట్ లో రాజమౌళికి కొన్ని ఆసక్తికర ప్రశ్నలే ఎదురయ్యాయి. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో “RRR” తో పాటు మరిన్ని సాలిడ్ ప్రాజెక్ట్స్ లైన్ లో ఉండగా వాటిలో మరో పాన్ ఇండియన్ సినిమా “రాధే శ్యామ్” కూడా ఉన్న సంగతి తెలిసిందే.

మరి ఈ పోటీ పైనే రాజమౌళి సాలిడ్ క్లారిటీ ఇచ్చారు. పోటీ అనేది గతంలో కూడా ఉందని ఆ సమయంలో ఎన్ని సినిమాలు ఉన్నా వాటి కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు అన్ని సినిమాలు కూడా ఆదరిస్తారని ఇందులో పోటీ అనుకోడానికి లేదు మా సినిమాతో పాటు అన్ని సినిమాలు కూడా బాగా రాణించాలని అనుకుంటున్నాని రాజమౌళి తనదైన శైలి క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :