“విక్రాంత్ రోణ” పై రాజమౌళి సాలిడ్ రివ్యూ..!

Published on Jul 31, 2022 12:30 pm IST

లేటెస్ట్ గా పాన్ ఇండియా సినిమా దగ్గర రిలీజ్ అయినటువంటి మరో భారీ బడ్జెట్ చిత్రం “విక్రాంత్ రోణ”. దర్శకుడు అనూప్ భండారి అలాగే కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కాంబోలో తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం రీసెంట్ గానే విడుదల అయ్యి పాన్ ఇండియా లెవెల్లో మంచి ఓపెనింగ్స్ ని అందుకుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా విషయంలో దర్శక ధీరుడు రాజమౌళి ముందు నుంచి కూడా తన సపోర్ట్ ని అందిస్తూ వస్తున్నారు. ఇక లేటెస్ట్ గా అయితే ఈ సినిమా చూసాక తన సాలిడ్ రివ్యూ ని అందించారు. మొదటగా హీరో కిచ్చా సుదీప్ కి కంగ్రాట్స్ చెబుతూ ఇలాంటి ఒక లైన్ పై ఇన్వెస్ట్ చెయ్యడానికి గుట్స్ కావాలని సుదీప్ ధైర్యానికి అభినందలు తెలిపారు.

అలాగే సినిమాలో ప్రీ క్లైమాక్స్ సినిమాకి హార్ట్ అని సూపర్బ్ గా ఉందని తెలిపారు. అంతే కాకుండా సినిమా ఇంత బాగా వస్తుందని అనుకోలేదని, సినిమాలో స్పెషల్ మెన్షన్ గా గుడ్డు ఫ్రెండ్ భాస్కర్ కి అందిస్తున్నానని రాజమౌళి తన ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ ని సినిమా చూసాక తెలియజేసారు. దీనితో సుదీప్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :