సీఎం జగన్ మరియు మంత్రి పేర్ని నానికి రాజమౌళి స్పెషల్ థాంక్స్.!

Published on Mar 9, 2022 2:00 pm IST

ఇటీవల ఏపీలో టికెట్ ధరలకి సంబంధించి నెలకొన్న సంక్షోభానికి తెర దించుతూ ఏపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త టికెట్ ధరలను అందిస్తున్నట్టుగా కొత్త జీవో ని రిలీజ్ చేశారు. దీనితో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సహా నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరి వారిలో మెగాస్టార్ చిరంజీవి సహా సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు ప్రభాస్ లు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కి మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మరి వీరితో పాటుగా గతంలో జగన్ ని మీట్ అవ్వడానికి వెళ్లిన భారీ చిత్రాల దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పోస్ట్ పెట్టారు. టికెట్ ధరలను సవరిస్తూ కొత్త జీవో ని రిలీజ్ చేయడం సంతోషంగా ఉందని ఈ ప్రయత్నం తెలుగు సినిమాకి ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నానని రాజమౌళి తెలియజేసారు.

సంబంధిత సమాచారం :