బాలయ్య ఒక ఆటంబాబ్.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Published on Nov 27, 2021 10:47 pm IST


నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్‌ చిత్రం “అఖండ”. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలోనే నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరుకాగా, దర్శక ధీరుడు రాజమౌళి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ అఖండ చిత్రంతో ఈ ఆడిటోరియానికే కాదు, సినిమా ఇండస్ట్రీకి ఒక ఊపు తెచ్చినందుకు బోయపాటి గారికి ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్ 2 నుంచి మొదలుపెట్టి కంటిన్యూస్ గా మళ్లీ థియేటర్లు ఇంత అరుపులు, కేకలతో నిండిపోవాలని అన్నారు. బాలయ్య బాబు ఒక ఆటంబాంబ్ అని, ఆ ఆటంబాబ్‌ను ఎలా ప్రయోగించాలో శ్రీనుగారికి మాత్రమే తెలుసని, ఆ సీక్రెట్ అందరికి చెప్పాలని, బాలయ్యగారు కూడా తన ఎనర్జీ సీక్రెట్ ఏంటో చెప్పలని అన్నారు. మీ అందరిలాగే నేను కూడా ‘అఖండ’ సినిమాను థియేటర్‌లోనే చూడాలని అనుకుంటున్నానని, మళ్లీ ఈ సినిమా ఇండస్ట్రీకి కొత్త ఊపును తీసుకురావాలని కోరుకుంటున్నానని అన్నారు.

సంబంధిత సమాచారం :