వైరల్ : హాలీవుడ్ ఈవెంట్ లో అదరగొట్టిన జక్కన్న..!

వైరల్ : హాలీవుడ్ ఈవెంట్ లో అదరగొట్టిన జక్కన్న..!

Published on Nov 20, 2022 2:59 PM IST

ఇప్పుడు మరోసారి టాలీవుడ్ సినిమాని సహా ఇండియన్ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా సినిమా దగ్గర నిలబెట్టిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. మరి బాహుబలి 2 చిత్రాలతో అలాగే ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో చేసిన తన “రౌద్రం రణం రుధిరం” చిత్రంతో ఇప్పుడు మరింత స్థాయిలో రీచ్ ని తాను సెట్ చెయ్యగా ఇప్పుడు విదేశాల్లో మరిన్ని స్పెయికాల్ స్క్రీనింగ్ లు అయితే ఈ చిత్రానికి పెద్ద ఎత్తున స్పెషల్ స్క్రీనింగ్ లు జరుగుతూ ఉండగా వీటిలో రాజమౌళి కూడా పాల్గొంటున్నారు.

మరి రాజమౌళి కి అయితే విదేశీ ఆడియెన్స్ నుంచి భారీ అప్లాజ్ అందిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా అయితే జక్కన్న ఓ ప్రముఖ హాలీవుడ్ ఈవెంట్ లో హాజరు కావడం వైరల్ గా మారింది. అనేక మంది హాలీవుడ్ స్టార్స్ పాల్గొనే గవర్నర్స్ అవార్డ్స్ లో అయితే రాజమౌళి మాంచి బ్లాక్ సూట్ ధరించి అక్కడ ఈవెంట్ లో కనిపించి అదరగొట్టారు. మరి దీనితో ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో సైతం రాజమౌళి ఆసక్తిగా మారగా కొన్ని వీడియో విజువల్స్ మరియు తన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు