“RRR” మాస్ ట్రైలర్ వెనుక అతడి అపారమైన కష్టం – రాజమౌళి

“RRR” మాస్ ట్రైలర్ వెనుక అతడి అపారమైన కష్టం – రాజమౌళి

Published on Dec 12, 2021 11:00 AM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి చేసిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం”. పాన్ ఇండియన్ లెవెల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకొని ఉన్న ఈ చిత్రం రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో అయితే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది.

మైండ్ బ్లోయింగ్ విజువల్స్ మరియు స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్ లతో కట్ చేసిన ఈ ట్రైలర్ అన్ని వర్గాల ఆడియెన్స్ ని కూడా ఎంతో థ్రిల్ చేసింది. అయితే మరి ఈ అద్భుతమైన ట్రైలర్ ని అంతే అత్యద్భుతంగా ఎడిట్ చేసిన ఎడిటర్ ప్రవీణ్ పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.

ఈ రోరింగ్ రెస్పాన్స్ అంతటి వెనుక తన పాత్ర ఎంతగానో పెట్టిన ఒకతను ఉన్నాడని “RRR” ట్రైలర్ ని ఎంతో ఓపికగా అపారమైన కష్టం పెట్టి కట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాని రాజమౌళి ఈ ట్రైలర్ కట్ వెనుక ఉన్న ప్రవీణ్ ని పరిచయం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు